హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్ డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో అద్భుత ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి వీరిద్దరు కలిసి 118 పరుగులు జోడించారు. అయితే పియూష్ చావ్లా వేసిన 13వ ఓవర్ ఐదవ బంతికి బెయిర్‌స్టో(39) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ దూకుడుకు కాస్త బ్రేక్ పడింది. విజయ్ శంకర్‌తో కలిసి వార్నర్ ఊహించినంత వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. రస్సెల్ వేసిన 16వ ఓవర్ చివరి బంతికి వార్నర్(85) ఊతప్పకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన యుసుఫ్ పఠాన్(1) రస్సెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో విజయ్ శంకర్(39) మెరుపులు మెరిపించడంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలింగ్‌లో రస్సెల్ 2, చావ్లా 1 ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm