హైదరాబాద్ : మెట్రోపోలీస్ హెల్త్‌కేర్ లిస్టింగ్‌లో అదరగొట్టింది. నేడు ఆ కంపెనీ షేర్లు దాదాపు 9.1శాతం ప్రీమియంతో మార్కెట్లో లిస్టైయ్యాయి. ఈ షేర్ల ఇష్యూ ధర రూ.880కాగా నేడు ట్రేడింగ్‌లో అత్యధికంగా రూ.960 వరకు వెళ్లాయి. ఈ ఐపీవో మెట్రోపోలీస్ రూ.1,204 కోట్లు సమీకరించింది. ఈ ఏప్రిల్ 3-5 మధ్యలో జరిగిన ఐపీవో బిడ్డింగ్ సమయంలో 5.84 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. మెట్రోపోలీస్ దేశ వ్యాప్తంగా 19రాష్ట్రాల్లో విస్తరించింది. ముఖ్యంగా పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో దీని వ్యాపారం బలంగా ఉంది. మొత్తం 83 క్లినికల్ లేబోరేటరీలు, 1,473 పేషెంట్ టచ్పాయింట్లు ఉన్నాయి. వివిధ రకాల లేబోరేటరీ సేవలను ఈ కంపెనీ అందజేస్తుంది. వైద్య పరిశోధనలకు సహాయ సహకారాలను అందజేస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm