హైదరాబాద్: ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు ఓపెనర్లు ధనాధన్ బ్యాటింగ్‌తో 9 వికెట్ల తేడాతో భారి విజయం నమోదు చేసుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు నిర్ణిత 20 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాట్స్ మెన్లలో క్రిస్ లిన్ (51) ఓంటరి పోరాటం చేశాడు. దీంతో 159 పరుగులు చేసి హైదరాబాద్‌కు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 160 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన హైదరాబాద్ ఓపెనర్లు మైదానం నలువైపులా బౌండరీలతో చెలరేగుతూ లక్ష్యం వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (67 అవుట్) , బెయిర్‌స్టో (80)లు అర్ధశతకాలు సాధించారు. ఇద్దరు కూడా నరైన్ బౌలింగ్‌లో హాఫ్‌సెంచరీలు నమోదు చేసుకోవడం విశేషం. ఛేదనలో ఎక్కడ కూడా తడబడకుండా సూపర్ బ్యాటింగ్‌తో పరుగులు సాధించారు. కోల్‌కతా నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలోని చేధించారు.
Mon Jan 19, 2015 06:51 pm