హైదరాబాద్ : హత్యకేసుల నిందితుడైన శ్రీనివాస్‌రెడ్డిని ఉరి తీయాలని అతడి తండ్రి బాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమతో సాధారణంగా ఉండే తన చిన్నకొడుకు ఇన్ని నేరాలకు పాల్పడతాడని ఊహించలేదని ఆవేదన చెందారు. ఆయన హైదరాబాద్‌లో ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. గతంలో కర్నూలులో ఉన్నపుడు ఓ కేసు నుంచి తన పెద్దకొడుకు సుధాకర్‌రెడ్డి, తాను వెళ్లి విడిపించామన్నారు. శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రావణి హత్య జరిగిన రోజు గ్రామంలోని వారు బావి వద్ద వెదుకుతుంటే తామిద్దరం అక్కడే ఉన్నామని.. అప్పుడు అతని మొహంలో ఎలాంటి భయాందోళనలూ కనపడలేదన్నారు. పోలీసులు తనను, తన తండ్రిని కస్టడీలో ఉంచిన సమయంలో పోచంపల్లి సమీపంలోని రావిరాలలో తమ బంధువుల ఇంట్లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని తానే పట్టించానని వెల్లడించారు. ఉరిశిక్ష కంటే పెద్ద శిక్షను తన తమ్ముడికి విధించాలని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm