హైదరాబాద్ : ప్రకాశం జిల్లా దర్శి జూనియర్ కాలేజీ చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు కనిపించడంతో ఒక్కసారిగా కలకలంరేగింది. దాదాపు 40 రోజుల సమయం తర్వాత ఇవి బయటపడటంతో స్థానికులు స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇది పట్టించుకునే అంశమే కాదని, మాక్ పోలింగ్ సమయంలోనివని తేలిగ్గా కొట్టిపారేశారు. సరిగ్గా కౌంటింగ్‌కు నాలుగు రోజుల ముందు బయటపడటంతో అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఎన్నికల సిబ్బంది వ్యవహార శైలిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm