హైదరాబాద్ : ప్రముఖ హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ చేదు అనుభవం ఎందురైంది. జోహెన్నస్‌బర్గ్‌లో శనివారం ఆర్నాల్డ్ 'క్లాసిక్ ఆఫ్రికా' పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్నాల్డ్ ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్నాడు. ఆ సమయంలో వెనకు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి ఆర్నల్డ్ ను కాలితో ఎగిరి తన్ని కింద పడిపోయాడు. దీంతో వెంటనే సిబ్బంది సదరు వ్యక్తి నుంచి అక్కడి నుంచి లాక్కుపోయి పోలీసులకు అప్పటించారు. ఘటన సమయంలో తీసిన వీడియోను ఆర్నాల్డ్ ట్విటర్లో షేర్ చేస్తూ.. 'నన్నెవరో తన్నారని నాకూ ఈ వీడియో చూస్తే కానీ తెలియలేదు. ఆ ఇడియట్ నా స్నాప్‌చాట్ వీడియోను పాడుచేయనందుకు సంతోషంగా ఉంది. ఒకవేళ మీరు ఈ వీడియో షేర్ చేయాలనుకుంటే ఆ వ్యక్తి అరుపులు వినిపించకుండా ఉన్న వీడియోను తీసుకోండి. ఎందుకంటే ఇలా చేసినందుకు అతనిపై స్పాట్లైట్(పాపులారిటీ) పడకూడదు. దక్షిణాఫ్రికాలోని ఆర్నాల్డ్ స్పోర్ట్స్ క్లబ్లో 90 రకాల క్రీడలు ఉన్నాయి. 24వేల అథ్లెట్లు ఉన్నారు. ఈ వీడియో ద్వారా వారికి పాపులారిటీ దక్కేలా చేద్దాం' అని పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తి ఎందుకు ఆర్నాల్డ్‌తో అలా ప్రవర్తించాడో మాత్రం ఇంకా తెలియలేదు. సదరు వ్యక్తి గతంలో కూడా ఇలాంటి ఘటనకు పాల్పడినట్లు పోలీసుల పేర్కొంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm