హైదరాబాద్: 'యంగ్ టైగర్' ఎన్టీఆర్ ఈరోజు తన 36వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. దాంతో తారక్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏటా ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్ని అభిమానులు ఘనంగా చేస్తుంటారు. అయితే ఈసారి వేడుకలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ గతేడాది రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన దూరమై ఇంకా ఏడాది పూర్తి కాలేదు. అందుకే ఎన్టీఆర్ ఈసారి పుట్టిన రోజు జరుపుకోవట్లేదని సన్నిహితులు తెలిపారు. అయినప్పటికీ అభిమానులు సోమవారం తెల్లవారుజామునే తారక్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ ఉదయం అభిమానులకు తన నివాసం నుంచి అభివాదం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm