హైదరాబాద్ : 2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉపయోగించిన 'చౌకీదార్' అనే పదం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. తాను ఈ దేశాన్ని కాపాడే చౌకీదార్(కాపలాదారుడు) అని మోడీ తన ప్రతీ ప్రసంగంలోనూ చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాక.. ప్రధాన బీజేపీ నేతలు, బీజేపీ మద్దతుదారులు అంతా తమ ట్విట్టర్ పేర్ల ముందు 'చౌకీదార్' అని పదాన్ని జత చేసుకున్నారు. ప్రధాని దగ్గరి నుంచి కేంద్ర మంత్రులు, ఇతర నేతలు కూడా చౌకీదార్ని తమ పేరు ముందు పెట్టుకున్నారు.
అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో.. మోడీ తన పేరు నుంచి చౌకీదార్ అనే పదాన్ని తొలగించారు. 'భారతదేశ ప్రజలు చౌకీదార్లుగా మారి దేశానికి ఎంతో సేవ చేశారు. చౌకీదార్ అతి పెద్ద శక్తిగా అవతరించి దేశాన్ని కుల, మత కలహాలు, అవినీతి తదితర దుష్టశక్తుల నుంచి దేశాన్ని కాపాడింది' అంటూ మోడీ ట్వీట్ చేశారు. ఇక తన పేరు నుంచి చౌకీదార్ అనే పదాన్ని తొలగిస్తున్నానని.. అంతేకాని చౌకీదార్ అనే పదం ఎల్లప్పుడు తన మదిలోనే ఉంటుందని మోడీ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 23,2019 07:09PM