హైదరాబాద్ : శ్రీలంకతో మ్యాచ్‌లో ఆసీస్ హిట్టర్ అరోన్ ఫించ్ అద్భుత సెంచరీ సాధించాడు.97 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్స్ లతో సెంచరీ పూర్తి చేశాడు. ఫించ్ లంక బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ధనంజయ డిసిల్వా బౌలింగ్‌లో వరుసగా 4, 6, 6 బాది ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. డిసిల్వా వేసిన 29వ ఓవర్లో ఫించ్ 20 పరుగులు రాబట్టి అతనిపై ఒత్తిడి పెంచాడు. ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసేసిరికి ఆస్ట్రేలియా రెండు వికెట్లకు 195 పరుగులు చేసింది. ఫించ్(109), స్మిత్(39) క్రీజులో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm