హైదరాబాద్: అగ్ర కథానాయకుడు నాగార్జున పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు అకౌంట్ సృష్టించారు. దీన్ని చూసిన నాగ్ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. వేరే వ్యక్తులు తన పేరుతో నడుపుతున్న నకిలీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్‌ను షేర్ చేశారు. 'ఇది నా అకౌంట్ కాదు.. నేను ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరచినప్పుడు కచ్చితంగా మీకు చెబుతా' అని ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm