హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని శ్రీరాంనగర్లో విషాదం చోటుచేసుకుంది. యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు
Mon Jan 19, 2015 06:51 pm