చెన్నై: ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన క్రికెట్ బ్యాట్‌ను భారత క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్ ఆవిష్కరించారు. చెన్నై ఫీనిక్స్ మార్కెట్ సిటీలోని పల్లాడియం మాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కపిల్..6,600 కిలోల బరువు, 51 మీటర్ల పొడవు ఉన్న భారీ క్రికెట్ బ్యాట్‌ను ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన, బరువైన క్రికెట్ బ్యాట్‌గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈ బ్యాట్ స్థానం పొందింది. ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్న తరుణంలో ఇటువంటి బ్యాట్ ఆవిష్కరించడం తనకెంతో ఆనందం కలిగిస్తోందని కపిల్ దేవ్ అన్నారు. గత కొన్నేళ్లుగా మంచి ఫామ్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టు ఈ సారి ప్రపంచ కప్ గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కపిల్‌దేవ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm