హైదరాబాద్: కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు.. ప్రముఖ నటుడు సూర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సూర్య కథానాయకుడిగా సూరారై పొట్టూర్ అనే చిత్రం తెరకెక్కుతోంది. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి మోహన్‌బాబుతో కలిసి పనిచేయడం గురించి సూర్య ట్విటర్ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు.
మోహన్‌బాబు సర్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి. ఆయన డిసిప్లైన్ ఉన్న లెజెండ్. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన సినీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు. సూరారై పొట్టూర్ చిత్రంలో భాగమైనందుకు ధన్యవాదాలు మోహన్‌బాబు సర్ అని పేర్కొన్నారు. ఇందుకు మోహన్‌బాబు స్పందిస్తూ.. నా గురించి చక్కటి మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు సూర్య. ఈ తరం గొప్ప స్టార్ అయివుండి సెట్స్‌లో నువ్వు చూపించే నిబద్ధతే చెబుతోంది నీది ఎంత చక్కటి స్వభావమో. తర్వాతి షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాను మై యంగ్ ఫ్రెండ్ అని ట్వీట్ చేశారు మోహన్‌బాబు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 17,2019 03:49PM