జోధ్‌పూర్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఊరట కల్పించింది. 1998 కృష్ణజింకల వేట కేసులో తప్పుడు అఫిడవిట్లు సమర్పించారంటూ దాఖలైన కేసులో ఆయనకు విముక్తి కల్పించింది. ఆయుధ లైసెన్స్ పత్రాలు రెన్యువల్ కోసం పంపించి... ఆ పత్రాలు పోయాయంటూ ఆయన తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే సల్మాన్ తరపు లాయర్ హస్తిమల్ సరస్వత్ మాట్లాడుతూ.. లైసెన్స్ కోసం తప్పుడు అఫిడవిట్లు, నిష్ప్రయోజక సమాచారం ఇవ్వాలన్నది సల్మాన్ ఖాన్ ఉద్దేశ్యం కాదు. విచారణ అనంతరం నా క్లయింటుపై వచ్చిన ఆరోపణలను కోర్టు కొట్టివేసింది... అని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm