హైదరాబాద్: క్రిమినల్ కేసులో నిందితుడిని తప్పించేందుకు లంచం తీసుకుంటూ ఓ ఎస్సై రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయిౌ ఓ వ్యక్తిని క్రిమినల్ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు బొల్లారం ఎస్ఐ బ్రహ్మచారి డబ్బు డిమాండ్ చేశారు. దీంతో సదరు వ్యక్తి డబ్బును ఏర్పాటు చేశాడు. అయితే అప్పటికే దీనిపై సమాచారం అందుకున్న అధికారులు బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో తనిఖీలు చేశారు. ఎస్ఐ బ్రహ్మచారి రూ.20 లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్ఐతో పాటు, కానిస్టేబుల్ నగేష్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm