హైదరాబాద్ : ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ ఆటగాడు షిమ్రన్ హెట్మేర్ రికార్డు సిక్సు బాదాడు. 104 మీటర్ల సిక్సు బాదాడు.. అంతేకాక.. 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో ఈ టోర్నమెంట్లో రెండు వేగవంతమైన అర్ధ శతకాన్ని సాధించాడు. అయితే ఆ తర్వాత ఎదురుకున్న బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి.. పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ అంతకు మించిన సిక్సు కొట్టాడు. మోర్తజా వేసిన 43వ ఓవర్లో హోల్డర్ 105 మీటర్ల సిక్సు కొట్టి.. ఈ టోర్నమెంట్‌లోనే అతి పెద్ద సిక్సు కొట్టాడు. కాగా, 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులుతో 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విండీస్ జట్టు స్కోరు ప్రస్తుతం 45 ఓవర్లకు 288/6గా ఉంది. క్రీజులో హోప్ 91, బ్రావో 2 పరుగులతో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm