The pitch is calling and you must go. Play #TezShots on the Google Pay app, on your Android phone and score runs to win scratch cards.
— Google Pay India (@GooglePayIndia) June 18, 2019
Expert Tip: Flex your fingers to give your best shot. https://t.co/ZXmn71WuIf pic.twitter.com/vWcAhp1jnU
హైదరాబాద్ : సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన గూగుల్ పే యాప్ యూజర్లకు చక్కని అవకాశం కల్పిస్తున్నది. ఆ యాప్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన తేజ్ షాట్స్ అనే ఓ మినీ గేమ్‌ను ఆడి అందులో రన్స్‌ను స్కోర్ చేస్తే అందుకు తగిన విధంగా స్క్రాచ్ కార్డు వస్తుంది. అంటే.. గేమ్‌లో 100 రన్స్ కొడితే రూ.50, 500 రన్స్ కొడితే రూ.100, 1000 రన్స్ కొడితే రూ.150, 2000 రన్స్ కొడితే రూ.1000, 3000 రన్స్ కొడితే రూ.2000 విలువైన స్క్రాచ్ కార్డులు వస్తాయి. అయితే ఈ స్క్రాచ్ కార్డును అన్‌లాక్ చేయాలంటే అక్కడ సూచించే విధంగా యూజర్లు ట్రాన్సాక్షన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ స్క్రాచ్ కార్డు అన్‌లాక్ అవుతుంది. ఆపై దాన్ని స్క్రాచ్ చేసి రివార్డు పొందవచ్చు.