న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వార శుభాకాంక్షలు తెలిపారు. ''రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు...రాహుల్ కు మంచి ఆరోగ్యంతోపాటు సుదీర్ఘ జీవితం లభించాలని కోరుకుంటున్నా'' అంటూ మోడీ ట్వీట్ చేశారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ స్పూర్తినిస్తున్నారని కాంగ్రెస్ అభిమానులు చెప్పారు. రాహుల్ గాంధీ తన జన్మదినం సందర్భంగా బుధవారం జరగనున్న అన్ని పార్టీ నేతల సమావేశానికి హాజరు అవుతారా ? లేదా అనేది ఇంకా తెలియలేదు.
Mon Jan 19, 2015 06:51 pm