ప్రస్తుతం చిరంజీవి ఃసైరాః సినిమా పనులతో బిజీగా వున్నారు. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తరువాత ఆయన కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. చిరంజీవి కథానాయకుడిగా ఒక సందేశాత్మక చిత్రాన్ని రూపొందించడానికి కొరటాల సిద్ధంగా వున్నారు.
కథలో సందేశం ఉన్నప్పటికీ, చిరంజీవి మార్క్ ఫైట్లు .. డాన్సులు ఉంటాయట. అందువలన బరువు తగ్గవలసిందిగా చిరంజీవికి కొరటాల సూచించినట్టుగా సమాచారం. ఃసైరాఃలో పాత్ర పరంగా బరువు పెరిగిన చిరంజీవి, కొరటాల సినిమా కోసం బరువు తగ్గనున్నారు. ఆల్రెడీ ఆయన జిమ్ కి వెళుతూ కసరత్తులు మొదలెట్టేశారని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 19,2019 11:15AM