హైదరాబాద్: గుల్బర్గాలో జరిగే హజరత్ ఖాజా బంద్నవాజ్ ఉర్స్ ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్-గుల్బర్గా మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి సీహెచ్.రాకేష్ తెలిపారు. హైదరాబాద్-గుల్బర్గా స్పెషల్ (రైల్ నెంబర్: 07178) హైదరాబాద్ నుంచి ఈనెల 18, 21వ తేదీల్లో రాత్రి 11.45 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6.25గంటలకు గుల్బర్గా చేరుతుంది. తిరుగు ప్రయాణంలో గుల్బర్గా-హైదరాబాద్ స్పెషల్ (రైల్ నెంబర్: 07177) గుల్బర్గా నుంచి ఈనెల 19, 22వ తేదీల్లో ఉదయం 7.00 గంటలకు బయల్దేరి, అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm