ఉత్తరాఖండ్: వివాదాలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ చాంపియన్‌కు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ప్రణవ్ సింగ్ చాంపియన్‌ను ఆరేళ్లపాటు సస్సెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్‌లోని ఖాన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. కొద్ది రోజుల క్రితం కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంతోషంతో తన అనుచరులకు ఓ హోటల్లో పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో మద్యం సేవించిన ప్రణవ్ సింగ్.. తుపాకులతో హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన పార్టీ అధిష్టానం.. ప్రణవ్ సింగ్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా.. గతంలో ఓ జర్నలిస్టును చంపేస్తానంటూ బెదిరించిన ఘటనలో ఆయనను మూడు నెలలపాటు సస్పెండ్ చేసిన అధిష్టానం.. తాజా ఘటన నేపథ్యంలో ఆరేళ్లు సస్పెండ్ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm