హైదరాబాద్: తాజాగా ఈ రియాల్టీ షోపై నటి హేమ స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బిగ్‌బాస్-3ని ఆపలేవంటూ.. ఈ షోకి తన మద్దతు తెలిపారు. క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ఈ షోలో ఉంటే నాగార్జున లాంటి పెద్ద హీరో హోస్ట్‌గా చేయడానికి ఎందుకు ఒప్పకుంటారని ప్రశ్నించారు. ఇక షోపై కేసు వేసిన వారి గురించి ప్రస్తావిస్తూ.. ఎవరితోనైనా నిర్వాహకులు తప్పుగా మాట్లాడితే అప్పుడే స్పందించాలి. నెల రోజుల ముందే జరిగితే ఇప్పుడు బయటకి వచ్చి చెబితే ఎలా? సెలెక్ట్ చేయలేదు అన్న తర్వాత ఇలా మాట్లాడడం ఎంతవరకు న్యాయం? నన్ను ఎవరైనా ఏమైనా అంటే ఆ రోజే స్పందిస్తా. ఆ రోజే మీడియా ముందుకు వస్తా. లేదంటే వారి కాలర్ పట్టుకొని నిలదీస్తా అని హేమ అన్నారు. బిగ్‌బాస్-3లో తనకు అవకాశం వస్తే తప్పకుండా పాల్గొంటానని తన మనసులోని మాటను చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm