హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరుకొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. గత ఏడాది కూడా ఫైనల్స్‌కు చేరుకొని రన్నర్ ఆప్‌గా నిలిచిన హైదరాబాద్ జట్టు 12 సీజన్‌కి ముందు కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న ఇంగ్లండ్ ప్రపంచకప్ కలని సాకారం చేసిన ట్రేవర్ బేలిస్‌ని జట్టు ప్రధాన కోచ్‌గా నియమిస్తున్నట్లు హైదరాబాద్ ప్రకటించింది. ఆస్ట్రేలియాకు చెందిన బేలిస్ గత కొంతకాలంగా ఇంగ్లండ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలవడంతో బేలిస్ కీలక పాత్ర పోషించారు. అంతేకాక.. కేకేఆర్ జట్టు రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచినప్పుడు కూడా ఆ జట్టుకు బేలిస్ కోచ్‌గా ఉన్నారు. ఇక బిగ్ బాష్ లీగ్, ఛాంపియన్స్ లీగ్‌లలో ఆయన సిడ్నీ సిక్సర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. కోచ్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉన్న బేలిస్‌ను కోచ్‌గా నియమిస్తున్నామని.. తద్వారా హైదరాబాద్ జట్టును ఆయన విజయం దిశగా నడిపిస్తారని ఆశిస్తున్నట్లు ఫ్రాంచైజీ పేర్కొంది. అంతేకాక.. ఇప్పటివరకూ జట్టు కోచ్‌గా వ్యవహరించిన టామ్ మూడీకి జట్టు యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm