హైదరాబాద్: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న రాక్షసుడు చిత్రం ట్రైలర్ విడుదలైంది. నేనంటే భయానికే భయం. నన్ను పట్టుకోవాలని అనుకోకు. పట్టుకుందామనుకున్నా అది నేనవను.. అంటూ వాయిస్ ఓవర్ వినిపిస్తుండగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ట్రైలర్ లో ఎంట్రీ ఇస్తాడు. పోలీసు అధికారి పాత్రలో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్, ఫైటింగ్ సన్నివేశాలను ఈ ట్రైలర్ లో చూపించారు. హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ లో రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే నెల 15న ఈ చిత్రం విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm