హైదరాబాద్: తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3కి హోస్ట్‌గా వ్యవహరించనున్న సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 46లోని నాగార్జున ఇంటి వద్ద ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ మేరకు బుధవారం సాయంత్రం నుంచే జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. బిగ్‌బాస్ షో మహిళలను కించపరిచే విధంగా ఉందని షోను రద్దు చేయకపోతే నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు నాగార్జున ఇంటి ముందు భద్రత పెంచారు. అటు వైపు వస్తున్న అనుమానితులను తనిఖీలు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm