న్యూఢిల్లీ: పొగ తాగడటం వల్ల మనుషులు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వీటి వల్ల చెట్లు కూడా సమస్యను ఎదుర్కుంటున్నాయన్న విషయం మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. సిగరెట్ పీకలను ఎక్కడపడితే అక్కడ పడేసే అలావాటును మనం చాలా మందిలో చూసే ఉంటా. అయితే ఇదే చెట్లకు హానికారకంగా మారుతున్నదని బ్రిటన్కు చెందిన ఆంగ్లీయా రస్కిన్ యూనివర్శిటీ తన పరిశోధనలో తెల్చింది. ఈ వివరాలను జర్నల్ ఆఫ్ టాక్సికాలజీలో ప్రచురించింది. ఈ సిగరెట్ పీకల కారణంగా విత్తనాలు మొలకెత్తే అవకాశం 36 శాతం మేర పడిపోయిందని వారు తెలిపారు. అంతేకాకుండా..వేర్లు, కాండం ఎదుగుదలలో కూడా తీవ్రమైన లోపాలు గుర్తించామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm