ముంబయి: విడుదలైన రోజు నుంచి మంచి టాక్ తెచ్చుకున్న బాలీవుడ్ చిత్రం 'సూపర్30' వసూళ్లపరంగా పదిరోజుల లోపే రూ. 100 కోట్ల క్లబ్బులో చేరుకుంది. పట్నా గణితవేత్త ఆనంద్‌కుమార్ జీవితాన్ని బయోపిక్‌గా తెరెకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్‌రోషన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పి, వారిని గణితంలో మేధావులుగా తీర్చిదిద్దడం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కలెక్షన్ల పరంగా మొదటివారం ప్రపంచవ్యాప్తంగా రూ. 75 కోట్లు వసూలు చేయగా నిన్నటి అదివారానికి మరో రూ. 24కోట్లు వసూళ్లు సాధించి రూ.100 కోట్ల క్లబ్బులో చేరుకున్నట్లు ట్రేడ్ పరీశీలకుడు తరణ్‌ఆదర్శ్ వెల్లడించారు. ప్రాంతీయ బాలీవుడ్ చిత్రాలతో పాటు హాలీవుడ్ సినిమాలు నుంచి కూడా గట్టి పోటీ ఎదురైనా 'సూపర్30' వసూళ్లలో దూసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm