హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. విమానం ఉదయం 6.50 గంటలకు బయల్దేరాల్సి ఉంది. ఉదయం 7.20 గంటలకు బయల్దేరుతుందని ఇండిగో సిబ్బంది బోర్డింగ్ పూర్తిచేసింది. కాగా విమానం రన్వే పైకి వెళ్లాక నిలిచిపోయింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని దాన్ని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. దీంతో గంట నుంచి విమానం రన్వే పైనే నిలిచిపోయింది.
Mon Jan 19, 2015 06:51 pm