హైదరాబాద్: పోలీసుశాఖ వివిధ విభాగాల్లో ఎస్సై, ఏఎస్సైలుగా జోన్-VIలో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 23, 24 తేదీల్లో హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఐజీపీ నార్త్‌జోన్ కార్యాలయంలో హాజరుకావాలని నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి 5 గంటల వరకు హాల్‌టికెట్, ప్రొవిజినల్ సెలక్షన్ కాపీ, నాలుగు ఫొటోలు, మూడుజతల విద్యార్హత జిరాక్సులతో రావాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm