న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అత్యధిక ఆధరణ పొందిన టిక్ టాక్ యాప్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. టిక్ టాక్‌లోని వీడియోలు పిల్లలపై చెడు ప్రభావం పడుతుందనే కారణంగా గతంలో ఈ యాప్ దేశ వ్యాప్తంగా బ్యానైంది. నిబంధనలకు వ్యతిరేకమైన వీడియోలు టిక్ టాక్ యాప్‌లో ఉండటంతో కేంద్రప్రభుత్వం తాజాగా యాప్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా 24 ప్రశ్నలను సంధించిన ప్రభుత్వం వాటికి వివరణ ఇవ్వాలని యాప్ యాజమాన్యాన్ని కోరింది. ఈ విషయంలో స్పందించిన యాప్ ప్రతినిధులు.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే కారణంతో 2018 జూలై నుంచి ఇప్పటి వరకు 60 లక్షల వీడియోలను యాప్ నుంచి తొలగించినట్లు తెలిపారు. అంతేకాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా ఉండే వీడియోలను యాప్‌లోకి అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm