మాంచస్టర్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌కి మాంచస్టర్ ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. మాంచస్టర్ ఎయిర్‌పోర్ట్‌లో వసీం అక్రమ్‌ని అధికారులు నిర్భందించారు. ఇన్సులిన్ తీసుకువెళ్తున్న వసీంపై అనుమానంతో అధికారులు తనిఖీలు చేశారు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. మాంచస్టర్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారుల చర్య చాలా బాధను కలిగించింది. నా ఇన్సులిన్‌తో నేను ప్రపంచమంతా తిరుగుతాను. కానీ ఈ రోజు చాలా ఇబ్బంది కలిగింది. నన్ను చాలా దారుణంగా ప్రశ్నించారు, అవమానించారు. అంతేకాక.. కోల్డ్ కేసులో ఉన్న నా ఇన్సులిన్ ను బయటకు తీసి ప్లాస్టిక్ సంచీలో పడేశారు అంటూ వసీం తన బాధను వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm