చెన్నై: తమిళ అగ్ర దర్శకుడు అట్లీ డైరెక్షన్లో స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం బిగిల్. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా హీరో విజయ్ చిత్ర యూనిట్ సభ్యులను మర్చిపోలేని విధంగా సత్కరించాడట. సినిమా కోసం పనిచేసిన సభ్యులందరికీ విజయ్ బంగారు ఉంగరాలు పంచాడట. దాదాపు 400 మందికి విజయ్ ఉంగారాలు అందించాడట. అలాగే విజయ్, డైరెక్టర్ అట్లీ సంతకాలు చేసిన ఫుట్బాల్స్ను కూడా యూనిట్ సభ్యులకు అందజేశారట. ఈ సినిమా ఫుట్బాల్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో అట్లీ, విజయ్ ఇలా యూనిట్ సభ్యులందరికీ తమ ఆటోగ్రాఫ్లతో కూడిన బంతులను అందించారట.
Mon Jan 19, 2015 06:51 pm