హైదరాబాద్ : తమిళ విద్యాసంస్థలలో కులం బ్యాండ్లు కలకలం రేపుతున్నాయి. విద్యార్థి కులం తెలిసేలా చేతికి బ్యాండ్లు ధరించాలని కొన్ని విద్యాస్థంస్థలు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బడుగు కులాల విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కులాల పేరిట విద్యార్థులను గుర్తించేందుకు వీలుగా బ్యాండ్లు ధరించాలన్న ఆదేశాలను పాటించవద్దని తమిళనాడు విద్యాశాఖ పేర్కొంది. కులాల వారీగా బ్యాండ్లు ధరించాలని విద్యార్థులను ఆదేశించిన విద్యాసంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఫ్రెండ్ షిప్ డే వంటి ప్రత్యేక సందర్భాలలో మాత్రమే బ్యాండ్లు ధరించాలని విద్యాశాఖ పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm