హైదరాబాద్ : ఆడపిల్లలకు బయటేకాదు ఇంట్లోనూ రక్షణ లేకుండా పోతుంది. జగిత్యాలలో సొంత తాతే బాలికపై అఘాయిత్యం చేసిన ఘటన సమాజం తలదించుకునేలా చేసింది. జరిగిన దారుణం గురించి ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి బాలికను లొంగదీసుకున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో ముసలి మృగాడి దాష్టికం బయటపడింది. ఘటనపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముసలి మృగం కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm