హైదరాబాద్ : మొబైల్స్ తయారీదారు హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 105 (2019) ఫీచర్ ఫోన్‌ను భారత మార్కెట్లో ఇవాళ విడుదల చేసింది. ఇందులో 1.77 ఇంచుల కలర్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. 2వేల వరకు కాంటాక్టులను, 500 ఎస్ఎంఎస్ల వరకు ఈ ఫోన్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఎఫ్ఎం రేడియో, ఎల్ఈడీ టార్చి లైట్, ప్రీ లోడెడ్ గేమ్స్, 4ఎంబీ ర్యామ్, 4ఎంబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 800 ఎంఏహెచ్ బ్యాటరీ 18.2 రోజుల వరకు స్టాండ్‌బై టైం తదితర ఫీచర్లను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు. నోకియా సిరీస్ 30 ప్లస్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫాంను ఈ ఫోన్లో ఏర్పాటు చేశారు. కాగా ఈ ఫోన్ బ్లూ, పింక్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా రూ.1199 ధరకు దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Mon Jan 19, 2015 06:51 pm