విశాఖపట్నం: నగరంలోని గోపాలపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక గర్బం దాల్చింది. గర్బం దాల్చిన విషయం తెలుసుకున్న యువకుడు అబార్షన్ చేయించాలంటూ బాలిక తల్లిని బెదిరించాడు. భయాందోళనకు గురైన బాలిక తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కేజీహెచ్ వైద్యులు అబార్షన్ చేశారు.అబార్షన్ చేసిన వైద్యులపై విచారణ జరపాలని డీసీపీ ఉదయ్‌భాస్కర్ పేర్కొన్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm