హైదరాబాద్ : తన ప్రియురాలు లారెన్ హషియాన్ను రహస్యంగా వివాహం చేసుకున్నాడు హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్. పెళ్లి దుస్తుల్లో దిగిన ఫొటోల్ని జాన్సన్ సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. ఆగస్టు 18న హవాయ్ ద్వీపంలో తమ వివాహం జరిగిందని చెప్పాడు. 2008 నుంచి జాన్సన్, లారెన్ ప్రేమలో ఉన్నారు. 2006లో 'ది గేమ్ ప్లాన్' సినిమా సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. 2007లో జాన్సన్ తన మొదటి భార్య డానీ గార్సియాకు విడాకులు ఇచ్చారు. వీరికి 18 ఏళ్ల కుమార్తె ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm