హైదరాబాద్: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరితే విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తారా? అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు ప్రభుత్వాని ప్రశ్నించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన కలెక్టరేట్ల ముట్టడి సందర్భంగా పోలీసులు రౌడీల్లా వ్యవహరించి విద్యార్థులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన దిష్టిబొమ్మను దగ్దం కార్యక్రమంలో నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. నిన్న అరెస్టు చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు సిహెచ్ రమేష్, ఉపాధ్యక్షులు జమ్మి అశోక్,హేమంత్, గాయత్రి,భవానీ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm