బ్రెజిల్ : రియో డిజనైరోలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును గుర్తు తెలియని గన్మెన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బస్సు రియో-నిటేరాయ్ సిటీ మార్గంలో ఉన్న బ్రిడ్జిపై వెళ్తుండగా గన్మెన్లు దాన్ని చుట్టుముట్టారు. ప్రయాణికులపై బెదిరింపులకు దిగారు. అయితే ప్రయాణికుల్లో ఆరుగురు అప్రమత్తమై బస్సు దూకి పారిపోగా..మరో 16 మందిని గన్ మెన్లు రౌండప్ చేశారు. సమాచారమందుకున్న పోలీసులు బ్రిడ్జిపైకి వచ్చి గన్మెన్లతో చర్చించి..పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్రిడ్జిపై కర్యూ వాతావరణం ఏర్పడటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. గన్ మెన్లు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలపై మాత్రం అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Mon Jan 19, 2015 06:51 pm