హైదరాబాద్ : నటుడు విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని చేయనున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పైనే పూరి కసరత్తు చేస్తున్నాడట. మరో వైపు ప్రీ ప్రొడక్షన్ పనులతో చార్మీ బిజీగా ఉందట. త్వరలోనే హీరోయిన్లతో పాటు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను ఆరంభించనున్నట్టు సమాచారం. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగు మొదలుపెట్టాలనే దిశాగా ఈ పనులు జరుగుతున్నాయట. పూరి ఉ విజయ్ దేవరకొండ కాంబినేషన్ పట్ల అభిమానులు పూర్తి ఆసక్తితో వున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm