న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన డెబీ గోడ్సె అనే మహిళ చేపలను పట్టుకునేందుకు నదికి వెళ్లింది. ఆమె వేసిన గాలానికి ఒక చేప తగిలింది. దీంతో ఎంతో సంబరపడిపోతూ దానికి బయటకు తీసి చూసింది. అంతే నోరెళ్లబెట్టడం ఆమె వంతయ్యింది. ఆ సమయంలో ఆమె భర్తకూడా పక్కనే ఉన్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం డెబీ.. రెండు నోర్లు కలిగిన చేపను చాంప్లెన్ నదిలో పట్టుకుంది. దానిని చూడగానే ఆమెకు ప్రాణం పోయినంతపనైంది. ఈ సందర్భంగా డెబీ గోడ్సె మాట్లాడుతూ మేము చేపలను వేటాడుతుండగా, రెండు నోర్లు కలిగిన చేప మాకు చిక్కింది. దానిని చూసి ఆశ్చర్యపోయాం. పైగా అది ఎంతో ఆరోగ్యంగా ఉంది అని తెలిపింది. కాగా ఆ రెండు నోర్లు కలిగిన చేపకు పొటోలు తీసుకున్న తరువాత డెబీ భర్త దానిని తిరిగి నీటిలో వదిలివేశారు. కాగా నాటీ బాయిస్ ఫిష్షింగ్ ఈ ఫోటోను పేస్‌బుక్‌లో పోస్టుచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm