హైదరాబాద్: టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన ఎయిర్టెల్ టీవీ యాప్ పేరు మార్చింది. ఇకపై ఈ యాప్‌ను ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీం యాప్‌గా వ్యవహరించనున్నారు. ఇటీవలే ఎక్స్‌స్ట్రీం పేరిట ఎయిర్టెల్ తన ఎయిర్టెల్ టీవీ యాప్‌కు గాను వెబ్వెర్షన్ను లాంచ్ చేయగా.. ఇప్పుడు టీవీ యాప్ పేరు మార్చింది. ఈ క్రమంలో త్వరలో ఎక్స్‌స్ట్రీం పేరిట ఓ నూతన స్మార్ట్బాక్స్తోపాటు స్మార్ట్ స్టిక్‌ను కూడా ఎయిర్టెల్ త్వరలో విడుదల చేయనుంది.
కాగా ఎక్స్‌స్ట్రీం యాప్, వెబ్‌వెర్షన్, స్మార్ట్‌బాక్స్, స్మార్ట్ స్టిక్లన్నింటిలోనూ యూజర్లు లైవ్ టీవీ చానల్స్, ప్రీమియం కంటెంట్‌ను వీక్షించవచ్చు. అందుకు గాను ఎయిర్టెల్ పలు సంస్థలతో భాగస్వామ్యం అయ్యింది. కాగా ఎక్స్‌స్ట్రీం స్మార్ట్‌బాక్స్ ద్వారా డీటీహెచ్, ఐపీటీవీ, ఓటీటీ కంటెంట్‌ను టీవీలో వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఎక్స్‌స్ట్రీం స్మార్ట్ స్టిక్ ద్వారా టీవీ హెచ్డీఎంఐ పోర్టుకు ఆ స్టిక్‌ను కనెక్ట్ చేసి లైవ్ టీవీ చానల్స్, ప్రీమియం కంటెంట్‌ను వీక్షించవచ్చు. ఇక ఈ రెండు డివైస్‌లను ఎప్పుడు విడుదల చేసే విషయం ఎయిర్టెల్ వెల్లడించలేదు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Aug 22,2019 12:48PM