Special: @imVkohli in conversation with @ivivianrichards (Part 1)
— BCCI (@BCCI) August 22, 2019
King Kohli turns anchor and quizzes the Caribbean Master to understand his fearless mindset - by @28anand
Full interview 🎥 - https://t.co/HHGvlzfFEi pic.twitter.com/ikl7oifKSi
హైదరాబాద్ : ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, విండీస్ బ్యాటింగ్ దిగ్గజం, మాజీ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ మధ్య ప్రత్యేక చర్చా కార్యక్రమం జరిగింది. సమకాలీన క్రికెట్లో కోహ్లి బ్యాటింగ్ దిగ్గజం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పటి విధ్వంసకర ఆటగాడు రిచర్డ్స్, కోహ్లి మధ్య జరిగిన స్సెషల్ ఇంటరాక్షన్ వీడియో టీజర్‌ని బీసీసీఐ ట్విట్టర్లో పోస్టు చేసింది. ఈ కార్యక్రమంలో కోహ్లి రిచర్డ్స్ నుంచి సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్‌లో ఎలాంటి ఫాస్ట్ బౌలర్ బౌలింగ్‌లోనైనా బెదురు లేకుండా ఎలా ఆడే వారని, బౌన్సర్లను సైతం అలవోకగా ఎదుర్కొనే ఆ స్థెర్యం ఏంటని ఈ వీడియోలో కోహ్లి రిచర్డ్స్‌ని ఇంటర్వ్యూ చేయడం చూడవచ్చు. కాగా, కోహ్లి బ్యాటింగ్‌పై రిచర్డ్స్ ఎన్నో సార్లు ప్రశంసల వర్షం కురిపించడం తెలిసిందే.
ది కింగ్ ఆఫ్ ఆంటిగ్వా, ది గ్రేట్ బ్యాట్స్‌మన్ ఆఫ్ ది వరల్డ్ వివియన్ రిచర్డ్స్, రన్ మెషీన్ విరాట్ కోహ్లి మధ్య స్పెషల్ ఇంటరాక్షన్ వీడియో టీజర్ ఇక్కడ చూడవచ్చు.