హైదరాబాద్ : సినీ పరిశ్రమలో హీరోయిన్గా అవకాశాలు సంపాదించాలంటే లైంగిక ఒత్తిడులకు తలొగ్గాల్సిందేనని ఇప్పటికే చాలా మంది మహిళలు వెల్లడించారు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది నటీమణులు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. సినిమాల్లోనే కాదు సీరియల్స్ కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని తాజాగా రోహిణి వెల్లడించింది. 'బిగ్‌బాస్' నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిణి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. 'బీటెక్ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను. ఓ సీరియల్ ఆడిషన్ కోసం నిర్మాతలను కలిశాను. అక్కడున్న ఇద్దరు నిర్మాతలు నన్ను కమిట్మెంట్ అడిగారు. ఆ తర్వాత మరో ఆడిషన్‌కు వెళ్లాను. అక్కడ వయసులో చాలా పెద్ద వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా నన్ను 'నీకు అవకాశమిస్తే.. నాకేమిస్తావ్' అని అడిగాడు. కెరీర్ ఆరంభంలో ఇలాంటివి చాలా ఎదుర్కొన్నాన-ని రోహిణి చెప్పింది.
Mon Jan 19, 2015 06:51 pm