లీడ్స్: యాషెస్ సిరీస్‌లో భాగంగా హెడ్డింగ్లే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత టాస్‌ని వర్షం కారణంగా అంపైర్లు వాయిదా వేశారు. ప్రస్తుతం వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ సజావుగా సాగే అవకాశం ఉంది. ఇప్పటికే జరిగిన రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా.. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకి కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గత మ్యాచలోని జట్టుతోనే కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా మూడు మార్పులు చేసింది. బాన్‌క్రాఫ్ట్, స్మిత్, సిడిల్ల స్థానంలో మార్కస్ హారిస్, మాన్రూస్ లబుస్చేంజ్, జేమ్స్ పాటిన్సన్‌ని జట్టులోకి తీసుకుంది. అయితే మళ్లీ వర్షం కురుస్తుండటంతో అంపైర్లు మ్యాచ్‌ని వాయిదా వేశారు. క్యూరేటర్లు పిచ్‌ని కవర్లతో కప్పి ఉంచారు.
Mon Jan 19, 2015 06:51 pm