హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేట్ మెట్రో గోడ పెచ్చులూడిపడి మౌనిక అనే యువతి మృతి చెందిన ఘటన జరిగిన కొద్ది సేపటికే మరో ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో పిల్లర్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అమీర్‌పేటలోని మెట్రో పిల్లర్ మధ్యలో ఉన్న డివైడర్‌ను బస్సు ఢీకొట్టి... సమీపంలో ఉన్న షాపులోకి దూసుకెళ్లింది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm