అమరావతి: కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభమైంది. కరకట్టపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. గుంటూరు జెడ్పీ మాజీ ఛైర్మన్ పాతూరి నాగభూషణం బంధువు కోటేశ్వరరావు వ్యవసాయ భూమిలోని గెస్ట్‌హౌస్‌లో 17 మీటర్ల ర్యాంప్‌ను సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. గతంలో అక్రమ నిర్మాణాలు తొలగించాలని పాతూరి గెస్ట్‌హౌస్‌కు సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని సీఆర్డీఏ అధికారులు పేర్కొంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm