సియోల్ : అత్యంత శక్తివంతమైన తుపాన్ తపాఫ్ దక్షిణ కొరియాలోని దక్షిణ భాగాన్ని కుదిపేసింది. ఈ తుపాన్ తాకిడికి 26 మంది గాయపడ్డారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. 27 వేలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని, రోడ్లన్నీ జలమయ్యాయని దక్షిణ కొరియా హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. దక్షిణ కొరియాలోని 11 విమానాశ్రయాల్లో 250 విమానాల రాకపోకలను నిలిపివేశారు.
Mon Jan 19, 2015 06:51 pm