హైదరాబాద్: సిటీలో పలుచోట్ల ఇవాళ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాధాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, అల్వాల్, కూకట్ పల్లి, లింగంపల్లి, పాతబస్తీ, సిటీ కళాశాల, జూపార్కు, నాగోల్, చింతల్, రామంతాపూర్, బోరబండ, రామంతపూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. గంట నుంచి వర్షం దంచికొట్టడంతో.. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. రద్దీ వేళ వర్షం పడటంతో.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవాళ్లు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm