విజయవాడ: అనుకున్నట్టుగానే మీ-సేవల స్థానంలో ఏపీ ప్రభుత్వం సిటిజిన్ సర్వీసెస్ ఆంధ్ర ప్రదేశ్‌ను ప్రవేశపెట్టింది. ఏపీ ఆన్లైన్ ద్వారా మీ-సేవలను నిర్వహించే ఫ్రాంచైజీ నిర్వాహకులకు మీసేవల పేజీ ఓపెన్ చేయగానే సిటిజన్ సర్వీసెస్ పేరుతో ఇంటర్ఫేజ్ వస్తోంది. ప్రస్తుతానికి యధావిధిగానే మీ - సేవల ద్వారా అందించే సర్వీసులు కొనసాగుతున్నాయి. దీనిని బట్టి ఇక మీదట మీ - సేవ పేరు బదులు సిటిజిన్ సర్వీసెస్ గా వాడే అవకాశాలు ఉన్నాయి. సిటిజన్ సర్వీసెస్ పేరును ఉపయోగించాలని ఇప్పటి వరకైతే మీ - సేవ నిర్వాహకులకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.
Mon Jan 19, 2015 06:51 pm